SARVA BHOOPALA IN SKVST _ స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుడు

Tirupati, 23 Feb. 22: On the fourth day evening, Sri Kalyana Venkateswara with His consorts blessed devotees in Kaliyamardhana Alankara on Sarvabhoopala Vahanam in Ekantam.

Temple DyEO Smt Shanti, AEO Sri Gurumurthy, Superintendent Sri Chengalrayalu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుడు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 23: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు కాళీయమర్ధనుడి అలంకారంలో స‌ర్వ‌భూపాల వాహనంపై అభ‌య‌‌మిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.

య‌శోప్రాప్తి :

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజి రంగ‌చార్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.