SARVABHOOPALA VAHANA OBSERVED _ సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీనివాసుడు
Tirupati, 5 Mar. 21: On the fourth day evening Sarvabhoopala Vahana Seva was held with religious fervour in Srinivasa Mangapuram.
The processional deity of Sri Kalyana Venkateswara Swamy decorated in Bakasura Vada Alankaram mused the devotees.
However, the event took place in Ekantam in view of Covid restrictions.
DyEO Smt Shanti and other temple staffs participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీనివాసుడు
తిరుపతి, 2021 మార్చి 05: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది.
భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం. ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. తమ ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్ కల్యాణమూర్తికి వాహనమైపోతారు. అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి కొలువుదీరడమే సర్వభూపాల వాహనసేవ.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయులు, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.