HAMSA VAHANA SEVA HELD _ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప

TIRUMALA, 16 As a part of the ongoing Navaratri brahmotsavam in Tirumala on Monday evening Hamasa Vahana Seva was held.

Sri Malayappa decked as Saraswati Ammavaru took out a celestial ride on the divine swan carrier to bless the devotees along the four mada streets.

Both the senior and junior pontiffs of Tirumala, TTD Chairman Sri B Karunakara Reddy, EO Sri AV Dharma Reddy and others were present.

In the cultural programs, different mythological characters were portrayed in front of Hamsa Vahana Seva which impressed devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప

తిరుమల, 2023 అక్టోబరు 16: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

హంస వాహనం – బ్రహ్మపద ప్రాప్తి

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

కాగా, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవ‌లు జ‌రుగుతాయి.

ఈ వాహన సేవలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.