HAMSA VAHANAM HELD _ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో గోవిందుని అభయం
TIRUPATI, 03 JUNE 2025: On the second evening as a part of ongoing annual brahmotsavams, the utsava idol of Sri Govindaraja Swamy atop Hamsa Vahanam blessed His devotees along the temple streets of Sri Govindaraja Swamy in Tirupati on Tuesday.
The Utsava deity glided along the four mada streets surrounding tge temple on the divine swan carrier in the pleasant evening.
The dance troupes enhanced the grandeur of the Hamsa Vahana Seva with their artistic and devotional performances.
Both the Pontiffs of Tirumala, FACAO Sri Balaji, DyEO Smt Shanti and other staffs, large number of devotees, Srivari sevaks were also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో గోవిందుని అభయం
తిరుపతి, 2025 మే 2025: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి స్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది.
వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.