HAMSA VAHANAM HELD _ హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

Tirupati, 21 Feb. 22: On the second day evening, Sri Kalyana Srinivasa in Saraswati Alankara blessed the devotees.

The Ekanta Brahmotsavams in Srinivasa Mangapuram witnessed the Sri Kalyana Venkateswara in the guise of Goddess of Wisdom holding Veena in one hand and books in another.

JEO Sri Veerabrahmam, Temple DyEO Smt Shanti, Vaikhanasa Agama Advisor Sri Vishnu Bhattacharyulu, AEO Sri Gurumurthy and others were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 21: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమ‌వారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై అనుగ్ర‌హించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.

ఉత్తమజ్ఞానానికి హంస సంకేతం. జ్ఞానరూప పరమహంస అయిన కల్యాణ వేంకటేశ్వరుడు హంసగా మారి తన దివ్య తత్వాన్ని వెల్లడించారు. హంస సరస్వతిదేవికి వాహనం. కనుక కల్యాణదేవుడు సరస్వతి రూపంలో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య గుణానికి నిదర్శనం.

ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ విష్ణుభట్టాచార్యులు, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ ర‌మ‌ణ‌య్య, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.