HANUMANTA VAHANAM HELD _ హనుమంత వాహనంపై కోదండ‌రాముని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

Tirupati, 22 June 2024: The annual Brahmotsavam at Appalayagunta witnessed on Sri Prasanna Venkateswara in Kodandarama Alankaram on Hanumanta Vahanam.

The devotees were thrilled to catch the glimpse of the deity on the divine carrier.

AEO Sri Ramesh, Superintendent Smt Srivani and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హనుమంత వాహనంపై కోదండ‌రాముని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2024 జూన్ 22: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం 7 గంటలకు హ‌నుమంత వాహ‌నంపై కోదండ‌రాముని అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌మిచ్చారు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధిచెందాడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వీరిని ద‌ర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

మ‌ధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహన సేవలో ఏఈఓ శ్రీ రమేష్, సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణ బట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.