PATTABHIRAMA ON HANUMAN _ హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

TIRUPATI, 20 NOVEMBER 2025: The annual Karthika Brahmotsavams at Tiruchanoor witnessed Sri Pattabhirama Avatara of Sri Padmavati Ammavaru on Hanumanta Vahanam on Thursday evening.

The deity decked as Sri Rama blessed Her devotees on the noble Hanumanta Vahanam.

Both the Pontiffs of Tirumala, EO Sri AK Singhal, JEO Sri Veerabrahmam, DyEO Sri Harindranath and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు 

తిరుపతి, 2025, నవంబర్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.

హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ  బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది. 

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్,  జెఈఓ శ్రీ వి. వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరీంధ్రనాథ్,  ఏఈవో శ్రీ దేవరాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.