BHADRADRI RAMA GRACES DEVOTEES _ హనుమంత వాహనంపై భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
TIRUPATI, 13 NOVEMBER 2023: Sri Padmavathi Devi in Bhadradri Rama Alankaram blessed Her devotees on the Hanumantha Vahanam on Monday evening.
Both the Pontiffs of Tirumala, TTD Chairman Sri Karunakara Reddy, JEO Sri Veerabrahmam, SE2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy, Additional HO Dr Sunil, AEO Sri Ramesh, Superintendent Smt Srivani and others were present.
హనుమంత వాహనంపై భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
తిరుపతి, 2023 నవంబరు 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు కటాక్షించారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు . రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎంఎల్ఏ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, విజివో శ్రీ బాలిరెడ్డి, ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.