SRI KALYANA VENKATESWARA ON HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై శ్రీకల్యాణ వేంకటేశ్వరుడు
Tirupati, 01 July 2025: As part of the ongoing Sakshatkara Vaibhavotsavams at Srinivasa Mangapuram temple, Sri Kalyana Venkateswara Swamy blessed devotees on Hanumantha Vahanam on Tuesday.
Rituals starting from Suprabhata Seva, Snapana Tirumanjanam, and Unjal Seva followed Hanumantha Vahana seva took place on the second evening.
Spl Gr Deputy EO Smt. Varalakshmi and AEO Sri Gopinath and others participated.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు
తిరుపతి, 2025, జూలై 01: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా జూలై 01వ తేదీ హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను ఆశీర్వదించారు.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ చేపట్టారు.
రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
అదేవిధంగా జూలై 02న బుధవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూలై 03న పార్వేట ఉత్సవం
జూలై 03వ తేదీన గురువారం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11.00 – 02.00 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది.
ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.