SRI PRASANNA VENKATESWARA SWAMY BLESSES DEVOTEES AS SRI KODANDARAMA ON HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై శ్రీ కోదండరాముడి అలంకారంలో  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

Tirupati, June 30, 2026: The annual Brahmotsavams at Appalayagunta continued with great spiritual fervour on Tuesday morning as Sri Prasanna Venkateswara Swamy appeared in the divine attire of Sri Kodandarama on Hanumantha Vahanam.

Devotees offered camphor harathi and chanted “Sri Rama” while receiving the Lord’s blessings.

 Punyahavachanam and Vasanthotsavam will be held in the afternoon.

The Lord will bless devotees on Gaja Vahanam at 7 p.m. 

TTD Deputy EO Sri Harindranath and other officials participated in the festivities.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

హనుమంత వాహనంపై శ్రీ కోదండరాముడి అలంకారంలో  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

రామనామ స్మరణల మధ్య భక్తులను కటాక్షించిన కలియుగ ప్రత్యక్ష దైవం

అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం

తిరుపతి, 2026 జూన్ 30: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు హనుమంత వాహనంపై శ్రీ కోదండరామ అలంకారంలో దివ్యమంగళ విహారం చేస్తూ భక్తులకు అభయప్రదానమిచ్చారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూశ్రీరామ నామస్మరణల మధ్య స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకుని పులకించిపోయారుహనుమంతునిపై శ్రీ కోదండరాముని అలంకారంలో స్వామివారి దర్శనం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంటల వరకు పుణ్యాహవాచనంవసంతోత్సవం నిర్వహించనున్నారు.

రాత్రి గజవాహనంపై దివ్య దర్శనం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గజవాహనంపై భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

 కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ఏఈవో శ్రీ దేవరాజులుసూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణిటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్ఆలయ అర్చకులుశ్రీవారి సేవకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది