SRI RAMA RIDES ON HIS FAVOURITE HANUMANTA _ హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం
Tirupati, 18 Mar. 21: On the sixth day of ongoing annual brahmotsavams in Sri Kodandarama Swamy temple at Tirupati, Sri Kodanda Rama took a celestial ride on His favourite carrier Hanumantha Vahanam on Thursday.
In view of Covid guidelines, the annual fete is being observed in Ekantam.
Both Senior and Junior Pontiffs of Tirumala temple, Spl. Gr.DyEO Smt Parvati
AEO Sri Durgaraju, Superintendent Sri Ramesh and other office staff were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం
తిరుపతి, 2021 మార్చి 18: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు.
వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు వసంతోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు గజవాహనంపై శ్రీకోదండరామస్వామివారు కనువిందు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీమతి పార్వతి, శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.