HANUMANTHA VAHANA SEVA HELD _ హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ శ్రీనివాసుడు అభయం
TIRUPATI, 25 June 2023: In connection with the ongoing annual Sakshatkara Vaibhavotsavams in Srinivasa Mangapuram, Hanumantha Vahana Seva was held on Sunday evening.
Earlier in the morning, Snapana Tirumanjanam was held to the utsava deities of Sri Kalyana Venkateswara and Sridevi, Bhudevi. In the evening Unjal Seva was held.
Special Gr. DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Chengalrayalu, Temple Inspector Sri Kirankumar Reddy were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ శ్రీనివాసుడు అభయం
– ఘనంగా సాక్షాత్కార వైభవోత్సవాలు
జూన్ 25, తిరుపతి 2023: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
అనంతరం రాత్రి 7 నుండి హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. జూన్ 26న గరుడ వాహనసేవ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్లు శ్రీ చంగలరాయులు, శ్రీ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది