AMMA AS KODANDARAMA _ హ‌నుమంత‌ వాహనంపై శ్రీ కోదండ‌రామ‌స్వామి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

Tirupati, 20 February 2025: Sri Padmavati Devi blessed devotees as Kodandarama on Hanumanta Vahana in Chennai on Thursday.

The ongoing Brahmotsavam in Sri Padmavati Ammavaru temple observed Hanumanta Vahana.

AEO Sri Parthasaradhi and other, devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

హ‌నుమంత‌ వాహనంపై శ్రీ కోదండ‌రామ‌స్వామి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

చెన్నై / తిరుపతి, 2025 ఫిబ్రవరి 20: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు శ్రీ కోదండ‌రామ‌స్వామి అలంకారంలో హ‌నుమంత‌ వాహనంపై భక్తులను అభ‌య‌మిచ్చారు.

హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది