HANUMANTHA VAHANA SEVA HELD _ హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

Tirupati, 23 May 2021: As a part of ongoing annual brahmotsavams in the famous and ancient Sri Govindaraja Swamy Temple in Tirupati, hanumantha Vahana Seva was observed on Sunday morning.

In view of covid-19 Seva was observed in Ekantam followed by Snapana Tirumanjanam between 9:30 a.m. and 10:30 a.m.

Both the Tirumala Jeeyar Swamis, Special Grade DyEO Sri Rajendrudu and other office staff were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

తిరుపతి, 2021 మే 23: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీ‌గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ నిర్వ‌హించారు.

త్రేతాయుగంలో రాముడు భక్తాగ్రగణ్యుడైన ఆంజ‌నేయ‌స్వామికి ఆత్మతత్త్వాన్ని బోధించినట్టు ప్రాచీనవాఙ్మయం నుండి తెలుస్తోంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.

అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనంతో అభిషేకం చేశారు.

కాగా సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ ఎటి శ్రీనివాస దీక్షితులు కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఎ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీ మునీంద్ర‌బాబు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.