SUNDARA RAJA AVATARA UTSAVAMS REACHES SECOND DAY _ హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం
TIRUPATI, 08 JULY 2023: The annual Sundara Raja Swamy Avatarotsavams reached the second day on Saturday at Tiruchanoor.
In the morning Abhishekam and in the evening Unjal Seva were performed to the utsava deities in Sri Krishna Mukha Mandapam.
In the night Hanumantha Vahana seva performed where in Utsavamurty blessed devotees all along the four mada streets.
AEO Sri Ramesh, Archaka Sri Babu Swamy and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం
తిరుపతి, 2023, జూలై 08: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు.
ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. కాగా ఆదివారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.