BRAHMOTSAVAMS WALL POSTER UNVEILED _ హిమయత్ నగర్ ఎస్వీ ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మెన్
Tirumala, 21 May 2025: The annual Brahmotsavam wall poster of Sri Venkateswara Swamy Temple, located in Himayatnagar, Hyderabad, was unveiled on Wednesday by TTD Chairman Sri B.R. Naidu. The event took place at the Chairman’s camp office in Tirumala.
The annual Brahmotsavams at the temple will be conducted from June 3 to June 7. The festivities will commence with Ankurarpanam on the evening of June 2 at 6 PM. Vahana Sevas will be held daily between 8:30 AM and 9:30 AM, again between 8PM and 9PM.
The important days includes Srivari Shanti Kalyanam at 10:30am and Garuda Seva at 8pm on June 5, Chakra Snanam at 11:30am and Pushpayagam in the evening of June 7.
Meanwhile AEO Sri U.Ramesh also participated in the wall poster release event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హిమయత్ నగర్ ఎస్వీ ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మెన్
తిరుమల, 2025, మే 21: హైదరాబాద్ హిమయత్ నగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం 20వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, గోడ పత్రికలను టిటిడి చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మెన్ ఛాంబర్ లో బుధవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూ హైదరాబాద్ హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయంలో జూన్ 03వ తేదీ నుండి 07వ తేదీ వరకు జరుగనున్నాయన్నారు. వేసవి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీరు, ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు తదితర ఏర్పాట్లను అధికారులు సమిష్టిగా, సమన్వయంతో చేపట్టాలని సూచించారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 06 గం.ల నుండి రాత్రి 9.00 గం.ల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. జూన్ 3వ తేదీ ఉదయం 06.30 గం.ల నుండి 8.45 గం.ల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.
వాహన సేవల వివరాలు
జూన్ 03వ తేదీన ఉదయం 10 – 11 గం.ల వరకు శేష వాహనం, రాత్రి 08.00 – 09.00 గం.ల వరకు హనుమంత వాహనం
జూన్ 04వ తేదీన ఉదయం 8.30 గం.లకు సూర్యప్రభ వాహనం, రాత్రి 08 గం.లకు చంద్రప్రభ వాహనం
జూన్ 05వ తేదీ ఉ. 8.30 గం.లకు గజ వాహనం, ఉదయం 10.30 గం.లకు శ్రీవారి శాంతి కల్యాణం, రాత్రి 08 గం.లకు గరుడ వాహనం
జూన్ 06వ తేదీ ఉ. 08.30 గం.లకు రథోత్సవం, రాత్రి 08 గం.లకు అశ్వ వాహనం
జూన్ 07వ తేదీ ఉదయం 11.30 గం.లకు చక్రస్నానం, సాయంత్రం 06 గం.లకు పుష్పయాగం, రాత్రి 09 గం.లకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాద వితరణ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఏఈవో శ్రీ యు. రమేష్ ఇతర అధికారులు పాాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.