హృషీకేశ్‌ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షికబ్రహ్మోత్సవాలు 

హృషీకేశ్‌ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షికబ్రహ్మోత్సవాలు

తిరుపతి, జూన్‌-4,  2009: ఉత్తరాంచల్‌ రాష్ట్రంలోని హృషీకేశ్‌ నందు ఆంధ్రాశ్రమం వద్ద కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షికబ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 8.10నిమిషాలకు మిధునలగ్నం నందు ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల ఆనందోత్సవాల మధ్య ప్రారంభమయ్యాయి. ఆలయం లోపల ధ్వజస్తంభం పై గరుడపటంను అలంకరించారు. వేదమంత్రోత్సవాల మధ్య కన్నుల పండుగగా జరిగిన ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి అటు ఉత్తర భారతీయులు, ఇటు దక్షిణ భారతీయులు వేలాదిగా పాల్గొన్నారు. 9రోజులు పాటు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామి వారు తన ఉభయదేవేరులతో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ క్రింద తెలిపిన వాహనాలపై హృషీకేశ్‌ పురవీధులలో ఊరేగుతూ భక్తులకు కన్ను విందైన దర్శనం ఇస్తారు.

ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో తితిదే ప్రజాసంబంధాల అధికారి టి.రవి, ఎ.ఇ.ఓ శ్రీ రామారావు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.