CHINNA SESHA VAHANA SEVA HELD _ చిన్నశేషవాహనంపై శ్రీ పాండురంగ‌స్వామి అలంకారంలో శ్రీనివాసుడు

చిన్నశేషవాహనంపై శ్రీ పాండురంగ‌స్వామి అలంకారంలో శ్రీనివాసుడు

హైద‌రాబాద్ / తిరుపతి, 2025 ఫిబ్రవరి 27: జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ పాండురంగ‌స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి

రెండో రోజు ఉదయం శ్రీ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

TIRUPATI, 27 FEBRUARY 2025: The ongoing annual Brahmotsavam at Jubilee Hills witnessed the procession of  Chinna Sesha Vahana Seva on Friday.

AEO Sri Ramesh and other temple staff, devotees participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI