RAJAMANNAR ON KALPAVRIKSHA _ కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడు
TIRUPATI, 01 MARCH 2025: During the ongoing annual Brahmotsavams in Sri Venkateswara Swamy temple in Jubilee Hills, the processional deity took a parade in Rajamamnar Alankaram on Kalpavriksha Vahanam.
On Saturday, several devotees thronged the temple to witness the vahana seva after darshan of the Mula Virat.
AEO Sri Ramesh and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడు
హైదరాబాద్ / తిరుపతి, 2025 మార్చి 01: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది