JUBILEE HILLS TEMPLE GEARS UP FOR V-DAY _ హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని శ్రీవారి ఆలయంలో డిసెంబరు 22న కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 16 Dec. 20: As Vaikuntha Ekadasi and Dwadasi are scheduled on December 25 and 26 respectively, the Sri Venkateswara Temple located at Jubiliee Hills is gearing up for the twin auspicious occasions.
TTD is making arrangements to provide Vaikuntha Dwara Darshanam to devotees on December 25 and 26.
In this connection, traditional temple cleansing fete, Koil Alwar Tirumanjanam will be observed in the temple on December 22.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని శ్రీవారి ఆలయంలో డిసెంబరు 22న కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2020 డిసెంబరు 16: టిటిడికి అనుబంధంగా ఉన్న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజన జరుగనుంది. డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసి నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమంతో ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.
డిసెంబరు 25, 26వ తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనం
డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ రెండు రోజుల్లో హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.