TIRUMALA TO BE TURNED INTO A HOLY GREEN CITY- TTD CHAIRMAN _ హోలీ గ్రీన్ సిటీగా తిరుమల
TTD CHAIRMAN AND EO LAUNCH 35 ELECTRIC CARS AT TIRUMALA
Tirumala, 30 August 2021: “Tirumala shall be transformed into a Holy Green City by inducting more and more electric vehicles in a phased manner”, said TTD Chairman Sri YV Subba Reddy.
TTD Chairman along with TTD EO launched 35 electric cars near Rambhageecha Rest House after special pujas were performed to vehicles.
Speaking to media later the TTD Chairman said plans were ready to replace diesel and petrol vehicles with electric vehicles at Tirumala and in the first phase 35 (Tata Nexon) electric cars bought from the Public sector CESL (Conversion Energy Services Ltd) were to ply on Tirumala roads.
In the second phase 32 electric buses including 20 TTD free buses and 12 RTC buses will be inducted within six months, he added.
The RTC electric buses will be operated between Srivari Padalu, Akasaganga and Papa Vinasanam routes. Upon TTD request, the RTC will operate all electric buses on Tirupati-Tirumala ghat roads in next 6 months.
He also appealed to TTD employees, locals, traders and Taxi operators travelling on Tirumala ghat roads to convert their vehicles into electric vehicles at the earliest to make Tirumala pollution-free.
He said TTD shall pay an EMI of Rs.33,600 per month for five years for each vehicle to own vehicles later and the leasing company would bear the maintenance cost during this five year period.
A fully charged electrical vehicle could travel for 250 kms and it took 8 hours for each charging with AC current and 90 minutes for DC electricity consuming 30 units of power for each charge. At present rates power cost is Rs.6.70 per unit and it worked out to only 80 paise per km.
TTD Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Transport GM Sri Sesha Reddy, DI Sri Mohan and other senior officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
హోలీ గ్రీన్ సిటీగా తిరుమల
దశలవారీగా పూర్తిగా విద్యుత్ వాహనాలు
ఈవోతో కలిసి 35 విద్యుత్ కార్లను ప్రారంభించిన టిటిడి ఛైర్మన్
తిరుమల, 30 ఆగస్టు 2021: తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్ సిటీగా మారుస్తామని, ఇందుకోసం దశలవారీగా పూర్తిగా విద్యుత్ వాహనాలను వినియోగిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. రాంభగీచా విశ్రాంతి గృహాల వద్ద సోమవారం ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డితో కలిసి 35 విద్యుత్ కార్లను ఛైర్మన్ ప్రారంభించారు. ముందుగా విద్యుత్ కార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో దశలవారీగా డీజిల్ వాహనాల స్థానంలో పూర్తిగా విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మొదటి దశలో టిటిడి అధికారిక విధుల కోసం వినియోగించేందుకు 35 విద్యుత్ కార్లను(టాటా నెక్సాన్) ప్రారంభించినట్టు చెప్పారు. ఈ విద్యుత్ కార్లను ప్రభుత్వరంగ సంస్థ అయిన కన్వర్జన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సిఇఎస్‌ఎల్) నుండి తీసుకున్నామన్నారు. రెండో దశలో మరో 6 నెలల లోపు 32 విద్యుత్ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందులో 20 టిటిడి ఉచిత బస్సులు కాగా, మరో 12 బస్సులను ఆర్‌టిసి నడుపుతుందన్నారు. ఆర్‌టిసి నడిపే ఈ 12 బస్సులు శ్రీవారి పాదాలు – ఆకాశగంగ – పాపవినాశనం మార్గంలో నడుస్తాయని తెలిపారు. టిటిడి విజ్ఞప్తి మేరకు మరో 6 నెలల వ్యవధిలోపు ఎపిఎస్ఆర్‌టిసి కూడా తిరుమల – తిరుపతి ఘాట్ రోడ్లలో విద్యుత్ బస్సులు నడిపేందుకు ముందుకొచ్చిందన్నారు. తిరుమలలో, ఘాట్ రోడ్లలో ప్రయాణించే ట్యాక్సీ / మ్యాక్సీ యజమానులు, టిటిడి ఉద్యోగులు, స్థానికులు, దుకాణదారులు కూడా తమ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, ఒక్కో విద్యుత్ వాహనానికి నెలకు రూ.33,600/- చొప్పున 5 సంవత్సరాల పాటు ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల తరువాత ఈ వాహనాలు టిటిడి సొంతమవుతాయి. ఈ వాహనాల నిర్వహణ వ్యయాన్ని 5 సంవత్సరాల పాటు సదరు సంస్థ భరిస్తుంది. పూర్తిగా ఛార్జింగ్ చేసిన వాహనం 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఒక వాహనం పూర్తి ఛార్జింగ్ కోసం సాధారణ AC విద్యుత్ ద్వారా అయితే 8 గంటలు, DC విద్యుత్ ద్వారా అయితే 90 నిమిషాల సమయం పడుతుంది. ఒక వాహనం పూర్తి ఛార్జింగ్ కోసం 30 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.6.70/- కాగా, ఒక కిలోమీటరు దూరం ప్రయాణించేందుకు 80 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, డిఐ శ్రీ మోహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.