WEBINAR ON HANUMAN BIRTH PLACE ON JULY 30 AND 31 _ హ‌నుమ జ‌న్మ‌క్షేత్రంపై జులై 30, 31వ తేదీల్లో వెబినార్‌

TIRUMALA, 08 JULY 2021: TTD had decided to conduct a webinar on Hanuman Birthplace on July 30 and 31 under the aegis of Sri Venkateswara Higher Vedic Studies wing.

TTD EO Dr KS Jawahar Reddy reviewed on the same issue with officials in his chamber in TTD Administrative Building on Thursday. 

Webinar consists of the epigraphically, mythological, Geographical, scientific evidences related to the Hanuman Birth place. The evidences from ancient texts includes Venkatachala Mahatyam, Sri Venkateswara Ithihasa Mala, from various Puranas, Hanuman in Sanskrit Literature, Tirumala in Vaishnava Sahityam etc.

Seers of various Mutts, Experts and Research Scholars from different Universities will take part in this webinar meet.

Additional EO Sri AV Dharma Reddy, National Sanskrit University VC Sri Muralidhara Sharma, CE Sri Nageswara Rao, SVHVS Project Officer Dr A Vibhishana Sharma were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హ‌నుమ జ‌న్మ‌క్షేత్రంపై జులై 30, 31వ తేదీల్లో వెబినార్‌

తిరుమ‌ల‌, 2021 జులై 08: హ‌నుమంతుని జ‌న్మ‌క్షేత్రంపై ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో జులై 30, 31వ తేదీల్లో తిరుప‌తిలో వెబినార్ నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యం తీసుకుంది. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని త‌న ఛాంబ‌ర్‌లో గురువారం ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌తో ఈ అంశంపై స‌మావేశం నిర్వ‌హించారు.

వెబినార్‌లో ఆంజ‌నేయుని జ‌న్మ‌స్థ‌లానికి సంబంధించిన ప్రామాణిక‌త, ఇత‌ర అంశాలు ఉంటాయి. ఇందులో పురాణాల ప్రామాణిక‌త‌, వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం ప్రామాణిక‌త‌, తిరుమ‌ల ఇతిహాసం, తిరుమ‌ల‌తో ఆంజ‌నేయునికి ఉన్న పురాణ సంబంధ అంశాలు, శ్రీ వేంక‌టేశ్వ‌ర ఇతిహాస‌మాల ప్రాశ‌స్త్యం అంశాలు ఉంటాయి. వీటితో పాటు హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లం, వాఙ్మ‌య ప్ర‌మాణాలు, సంస్కృత వాఙ్మ‌యం హ‌నుమంతుడు, వైష్ణ‌వ‌సాహిత్యంలో తిరుమ‌ల‌, శాస‌న‌ప్ర‌మాణాలు, భౌగోళిక ప్ర‌మాణాలు ఇతర అంశాలపై వెబినార్ నిర్వ‌హిస్తారు. ఈ వెబినార్‌లో మ‌ఠాధిప‌తులు, వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన ఉన్న‌త‌స్థాయి ప‌రిశోధ‌కులు పాల్గొంటారు.

స‌మావేశంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌య ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శర్మ‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.