1052ND AVATARA MAHOTSAVAM OF SRI TIRUMALA NAMBI ON AUGUST 30 AND 31 _ ఆగస్టు 30, 31వ తేదిల్లో శ్రీ తిరుమల నంబి 1052వ అవతార మహోత్సవాలు
Tirumala, 21 August 2025: The 1052nd Avatara Mahotsavam of the eminent Vaishnava Acharya, Sri Tirumalanambi, will be grandly observed on August 30 and 31 at the Sri Tirumalanambi Temple located in the South Mada Street of Tirumala.
As part of the celebrations, 16 eminent scholars will deliver discourses on the life history of Sri Tirumalanambi in the temple premises.
Sri Tirumalanambi, one of the foremost devotees of Sri Venkateswara, is credited with initiating the sacred service of offering theertha kainkaryam to శ్రీ Venkateshwara. He was both the maternal uncle and revered guru of Bhagavad Ramanujacharya. According to the scriptures, he also recited the Ramayana to Sri Ramanuja.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 30, 31వ తేదిల్లో శ్రీ తిరుమలనంబి 1052వ అవతార మహోత్సవాలు
తిరుమల, 2025 ఆగస్టు 21: ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1052వ అవతార మహోత్సవాన్ని ఆగస్టు 30, 31వ తేదీల్లో తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు.
శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీవేంకటేశ్వరస్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్రజలాలను తిరుమల ఆలయానికి 8 కి.మీ దూరంలో ఉన్న పాపవినాశనం తీర్థం నుండి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాపవినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు తిరుమలనంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని ఆడిగారు. ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమలనంబి తిరస్కరించారు. అంతట వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లుచేసి నీరు తాగారు.
అందుకు తిరుమలనంబి బాధపడుతూ ”వయోభారం కారణంగా నేను తిరిగి అంతదూరం పాపవినాశనం వెళ్లి స్వామివారికి అభిషేకజలం తీసుకురావడం సాధ్యంకాదు, ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా” అని దు:ఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు ”చింతించకు తాతా నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా” అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ”ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు” అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమలనంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడింది.
