10K MORE TONSURES ON G-DAY THIS YEAR _ బ్రహ్మోత్సవాల్లో కల్యాణ కట్టలో క్షురకుల సేవలు అభినందనీయం: కల్యాణ కట్ట డిప్యూటీ ఈవో శ్రీవెంకటయ్య
TIRUMALA, 01 OCTOBER 2025: On the day of Garuda Seva this year, ten thousand more number of pilgrims offered tonsures when compared to last year, said Kalyana Katta DyEO Sri Venkataiah.
Speaking to media persons at Rambhageecha 2 media center on Wednesday he said 1148 tonsurers working round the clock and in the last seven days over 2.11 lakh devotees offered their hairs while on Peratasi Second Saturday on October 27 a maximum of 49,088 devotees offered their hairs, he added.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
బ్రహ్మోత్సవాల్లో కల్యాణ కట్టలో క్షురకుల సేవలు అభినందనీయం: కల్యాణకట్ట డిప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య
తిరుమల, 2025 ఆక్టోబర్ 01: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు నిరంతరాయంగా కృషి చేసిన కల్యాణ కట్ట క్షురకుల సేవలు అభినందనీయమని ఆ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య అన్నారు. తిరుమలలోని రామ్ భగీచా-2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ లో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులు తలనీలాలు సమర్పించేందుకు 1148మంది క్షురకులు సేవలు అందించారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో గత ఏడు రోజుల్లో 2.11 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, నాలుగో రోజున అత్యధికంగా 49,088 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. ఈ ఏడాది గరుడ సేవ అన్నాడు గత ఏడాది కన్నా పదివేల మంది పైగా భక్తులు అధికంగా తలనీలాలు సమర్పించారని తెలిపారు.
నూతన యాత్రికుల వసతి సముదాయం-5లో కూడా మూడు షిప్టుల్లో 120 క్షురకులు నిరంతరాయంగా సేవలు అందించారని తెలిపారు.
తలనీలాలు సమర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలియజేశారు.

