12-HOUR NONSTOP UPANISHAD DISCOURSE ENTERS INTERNATIONAL WONDER BOOK OF RECORDS _ 12 గంటల పాటు నిర్విరామంగా ఉపనిషత్తుల సందేశము

TIRUPATI, 11 JUNE 2025: A 12-hour uninterrupted discourse on the messages of the Upanishads was held on Wednesday at Annamacharya Kalamandiram, Tirupati. The event was organized by the National Gita Propagation Committee in association with TTD and Hindu Dharma Prachara Parishad.

Sri Ponna Krishnamurthy, Program Assistant of HDPP and a noted scholar, delivered the commentary from 7 AM to 7 PM without a break. His achievement was recognized by the International Wonder Book of Records, London.

The discourse covered key teachings from Taittiriya, Mandukya, Prashna, Kena, Aitareya, and Katha Upanishads.

Prominent attendees included representatives from the National Gita Committee, Vice-Chancellors of SV Vedic University and National Sanskrit University, saints from Sri Ramakrishna Math and Lalita Peetham, among others.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

12 గంటల పాటు నిర్విరామంగా ఉపనిషత్తుల సందేశము

ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు

తిరుపతి, 2025, జూన్ 11: తిరుపతి తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మప్రచార పరిషత్ సౌజన్యంతో జాతీయ గీతా ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో జూన్ 11న తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 07.గం.ల నుండి రాత్రి 07.00 గం.ల వరకు నిర్విరామంగా ఉపనిషత్తుల సందేశంపై వ్యాఖ్యానం జరిగింది. ఈ కార్యక్రమంలో పౌరాణిక శిరోమణి మరియు ధర్మప్రచార పరిషత్ ప్రొగ్రాం అసిస్టెంట్ శ్రీ పొన్నా కృష్ణమూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 12 గం.ల పాటు నిర్విరామంగా వ్యాఖ్యాతగా వ్యవహరించినందుకు
లండన్ కు చెందిన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అయింది.

12 గం.ల పాటు తైత్తిరీయోపనిషత్, మాండూక్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కేనోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, కఠోపనిషత్తు అంశాలపై వ్యాఖ్యానం చేశారు. త్తెత్తిరీయోపనిషత్ లో శిక్షావల్లి, బ్రహ్మవల్లి, భృగువల్లి అంశాలను, మాండూక్యోపనిషత్తులో లోకం, ప్రాణులు, భగవంతుడు ఒక్కటే అనే మహోన్నత సత్యం అనే అంశాన్ని, ప్రశ్నోపనిషత్తులో ప్రాణులు ఎక్కడ్నించి ఉద్భవించాయి, మనిషిలో ఏఏ శక్తులు ఉన్నాయి, ఏఏ శక్తులు పనిచేస్తాయి, ఓంకార ధ్యానం అంటే ఏమిటి, ఆత్మ ఎక్కడ ఉంది అనే అంశాలను, కేనోపనిషత్తులో శరీరం జీవించడం, మనస్సు పని చేయడం తదితర అంశాలను, ఐతరేయోపనిషత్తులో తల్లి నుంచి శరీరాన్ని తండ్రి నుండి ప్రాణాన్ని పొందే మనిషిలో భగవంతుడు ఆత్మగా ప్రవేశించడం, కఠోపనిషత్తులో విద్యార్థి యొక్క ఆత్మగౌరవం సర్వ శ్రేయోభిలాషత్వం, మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతారు, మరణాన్ని జయించడం ఎలా అనే విషయాలపై నిర్విరామంగా 12 గంటల పాటు ఉపనిషత్తుల సందేశాన్ని వివరించారు.

ఈ కార్యక్రమానికి జాతీయ గీతా ప్రచార సమితి ప్రతినిధులుశ్రీ రాజబోయన వెంకటేశ్వర్లు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాణిసదాశివమూర్తి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుల్లపల్లి శ్రీ రామకృష్ణ మూర్తి, శ్రీ రామకృష్ణ మఠం నుండి పూజ్య శ్రీ శ్రీ శ్రీ స్వామి సుకృతానంద, శ్రీ లలిత పీఠం వ్యవస్థాపక పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద గిరి స్వామి వారు, తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.