138th BIRTH ANNIVERSARY OF SRIMAN VETURI PRABHAKARA SASTRY CELEBRATED _ ఘనంగా శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 138వ జయంతి

Tirupati, 07 February  2026: The 138th Birth Anniversary of Sriman Veturi Prabhakara Sastri was observed with grandeur at Annamacharya Kalamandiram in Tirupati, on Saturday.

Addressing the gathering, Dr. D. Prabhakara Krishnamurthy, Special Officer, TTD Puranetihasa Project, described Veturi Prabhakara Sastri as a scholar of exceptional intellect who followed the yogic path and made invaluable contributions to Telugu literature.

A literary seminar was held on the occasion. Retired Professor of the University of Hyderabad, Prof. Remalla Venkataramakrishna Sastri, highlighted the multifaceted works of Sri Sastri, while Dr. T. Rajashekhar of Sri Venkateswara University spoke on his role in bringing to light the literature of the Tallapaka poets, including Annamacharya compositions.

Earlier, floral tributes were offered to the life size bronze statue of Sriman Veturi Prabhakara Sastri. 

Floral tributes were also paid to his statue located at the TTD Oriental College premises by officials and faculty members. Annamacharya Project Director Dr Medasani Mohan was also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి ప్రజ్ఞా ప్రభాకరుడుడా. ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి

ఘనంగా శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 138 జయంతి

తిరుపతి, 2026, ఫిబ్రవరి 07: శ్రీమాన్  వేటూరి ప్రభాకర్ శాస్త్రి ప్రజ్ఞా ప్రభాకరుడని, యోగ మార్గాన్ని అనుసరించారని టిటిడి పురాణేతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డా. ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి అన్నారు. వేటురి వారికి యోగబలం, సంకల్ప బలం మూలంగా ఇన్ని రచనలు చేయగలిగారని, ఎన్నో పరిశోధనా  గ్రంథాలను పరిష్కరించారని ప్రశంసించారు. శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి 138వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు నిర్వహించారు.

 

అనంతరం బహుముఖ ప్రజ్ఞాశాలి బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అనే అంశంపై హైదరాబాద్ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు ఆచార్య రేమళ్ళ వేంకటరామకృష్ణ శాస్త్రి మాట్లాడారు. వేటూరి వారు శాసన పరిశోధకులుగా, సాహిత్య పరిశోధకులుగా, భాషావేత్తగా, యోగి సత్వమునిగా, కవిగా, పండితునిగా తన బహుముఖ ప్రజ్ఞను చాటారని తెలియజేశారు.

అటు తర్వాత, తాళ్ళపాక కవుల సాహిత్య ఉద్ధరణలో వేటూరి వారి కృషి అనే అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ ప్రతినిధి డా. టి. రాజశేఖర్ మాట్లాడారు.  వేటూరి వారి కరస్పర్శ తగలనిదే అన్నమాచార్యుల సంకీర్తనలు వెలుగులోకి రాలేదని, తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క కూడా వేటూరి వారి ద్వారానే వెలుగులోకి వచ్చారన్నారు. తాళ్లపాక వాంగ్మయాన్ని సంపూర్ణంగా వెలుగులోకి తీసుకురావాలని సంకల్ప బలంతో పనిచేశారని కొనియాడారు. వేటూరి వారు టీటీడీకి అందించిన సేవలు, శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి పై రచించిన కీర్తనలు వెలుగులోకి తేవడానికి చేసిన పరిశోధనల గురించి వక్తలు గుర్తు చేసుకున్నారు.

ముందుగా అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి సాహితీ సదస్సును ప్రారంభించారు.

అంతకుముందు, శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 138వ జయంతి సందర్బంగా శనివారం శ్వేత భవనం ఎదురుగా, టీటీడీ ప్రాచ్య కళాశాలలో ఉన్న శ్రీ వేటూరి విగ్రహాలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ డా. మేడసాని మోహన్, ఎస్వీ ఓరియంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. సీతారామారావు, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. సి. లత,  అధ్యాపకులు పుష్పమాలలు సమర్పించారు.

టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.