174th ARADHANOTSAVAM OF SRI THYAGARAJA ON FEB 2 _ ఫిబ్ర‌వ‌రి 2న శ్రీ త్యాగ‌రాజ‌స్వామివారి 174వ ఆరాధ‌నోత్స‌వం

Tirupati, 31 January 2021: The 174th Aradhanotsavams of eminent composer and patriarch of Carnatic sangeet, Saint Sri Thyagaraja Swami will be held on February 2 (Pushya Bahula Panchami) at Sri Venkateshwara College of Music and Dance.

TTD has been organising such cultural events as part of the Vaggeyakara Vaibhavam program under the aegis of the college.

As part of the program Brunda Gana of Sri Thyagarajaswam’s Pancha Ratna sankeetans will be held between 9am and 11 am at the college by its students, faculty and retired teachers and local artists.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 2న శ్రీ త్యాగ‌రాజ‌స్వామివారి 174వ ఆరాధ‌నోత్స‌వం

తిరుప‌తి, 2021 జనవరి 31: సుప్ర‌సిద్ధ వాగ్గేయకారుడు, కర్ణాటక సంగీత సామ్రాట్‌ శ్రీత్యాగరాజస్వామివారి 174వ ఆరాధనోత్సవాన్ని ఫిబ్ర‌వరి 2వ తేదీ మంగ‌ళ‌‌వారం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీ‌త్యాగరాజస్వామివారు పుష్యబహుళ పంచమి నాడు పరమపదించారు.

టిటిడి శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాగ్గేయకార వైభవం కార్యక్రమంలో భాగంగా టిటిడి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ఉదయం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీత్యాగరాజస్వామివారి పంచ‌ర‌త్న కృతుల‌ను బృంద‌గానం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌ళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌ అధ్యాప‌కులు, విద్యార్థులు, విశ్రాంత అధ్యాప‌కులు, స్థానిక క‌ళాకారులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.