TTD 2020 CALENDARS AND DIARIES RELEASED BY TTD CHAIRMAN, EO _ 2020 క్యాలెండర్ల‌ను ఆవిష్క‌రించిన టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో

Tirupati, 29 Nov. 19: The TTD Calendars and Diaries for the year 2020 have been released by TTD Trust Board Chairman Sri YV Subba Reddy and EO Sri Anil Kumar Singhal on Friday.

Speaking to media after the release of Calendars and Diaries at Sri Padmavathi Rest House in Tirupati, the Chairman said, TTD has printed 12 lakh copies of 12-sheet calendars each priced at Rs.100/-, 3.5 lakh copies of Srivari Big Calendars each at Rs.15/-, 10 thousands of Ammavari single Calendars big priced at Rs.15 each, 4 lakhs copies of Swamivaru and Ammavaru small calendar priced at Rs.10/- each, two lakh copies of Telugu Panchangam Calendars at Rs.20/-, six lakh copies of Big Diaries at Rs.130/-, 1.5lakh copies of small diaries at Rs.100/- each, 75 thousand copies of table top calendars each priced at Rs.60.

The Chairman said, the calendars will be open for sales to devotees from first week of December while the Diaries from Second Week onwards in Tirupati, Tirumala, all TTD book stalls located at Chennai, Bengaluru, Hyderabad, Vijayawada, Visakhapatnam, New Delhi, Mumbai and in all Information Counters and Kalyana Mandapams of TTD located across the country.

JEO Sri P Basanth Kumar, Board Member Sri M Sriramulu, Sri Sivakumar, Special invitees Sri B Karunakara Reddy, Sri Govindahari, Deputy EO TTD Press Sri Vijay Kumar were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

2020 క్యాలెండర్ల‌ను ఆవిష్క‌రించిన టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో

తిరుపతి, 2019 న‌వంబ‌రు 29: టిటిడి రూపొందించిన 2020 క్యాలెండ‌ర్ల‌ను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ శుక్ర‌వారం తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ రూ.100/- విలువ‌గ‌ల 12 పేజీల క్యాలెండర్లు 12 లక్షలు, రూ.15/- విలువ‌గ‌ల శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.50 లక్షలు, రూ.15/- విలువ‌గ‌ల శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, రూ.10/- విలువ‌గ‌ల శ్రీవారు మ‌రియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, అదేవిధంగా రూ.20/- విలువ‌గ‌ల తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2 లక్షలు, రూ.60/- విలువ‌గ‌ల టేబుల్ టాప్ క్యాలెండ‌ర్లు 75 వేలు ముద్రించామ‌ని వివ‌రించారు. వీటితోపాటు రూ.130/- విలువ‌గ‌ల పెద్ద‌ డైరీలు 6 లక్షలు, రూ.100/- విలువ‌గ‌ల చిన్నడైరీలు 1.50 లక్షలు ఉన్నాయ‌ని తెలిపారు.

డిసెంబరు మొదటి వారం నుండి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్త‌క విక్ర‌య‌శాల‌లు, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లో, టిటిడి కల్యాణ మండపాల్లో క్యాలెండ‌ర్లు అందుబాటులో ఉంటాయ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. డిసెంబరు రెండో వారం నుండి డైరీలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ మోరంశెట్టి రాములు, శ్రీ శివ‌కుమార్‌, ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, శ్రీ‌ గోవింద‌హ‌రి, ప్రెస్ డెప్యూటీ ఈవో శ్రీ విజ‌య‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.