TTD RELEASES SIX SHEET CALENDARS _ 2023 టీటీడీ 6షీట్ల క్యాలండర్ విడుదల
TIRUMALA, 23 DECEMBER 2022: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Friday released six-sheet calendar 2023 of TTD. The price of each calendar is Rs.450.
The event took place in Chairman camp office in Tirumala. Following the demand from the devotees last year, TTD has released this calendar which will be available in TTD information centres located in major cities.
JEO (E & H) Smt Sada Bhargavi, PRO Dr T Ravi, Printing Press Special Officer Sri Ramaraju were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
2023 టీటీడీ 6షీట్ల క్యాలండర్ విడుదల
తిరుమల 23 డిసెంబరు 2022: 2023 సంవత్సరం కుసంబంధించి టీటీడీ ముద్రించిన 6 షీట్ల క్యాలండర్ ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం విడుదల చేశారు.
తిరుమల లోని చైర్మన్ క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి, పీఆర్వో డాక్టర్ రవి, ప్రెస్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు పాల్గొన్నారు. గతఏడాది ముద్రించిన ఈ క్యాలండర్లకు డిమాండ్ ఎక్కువగా వచ్చినందువల్ల ముఖ్యమైన అన్ని నగరాల్లో విక్రయాలకు అందుబాటులో ఉంచాలని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ క్యాలండర్లు తిరుమల,తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంచుతారు. చెన్నై,బెంగుళూరు, హైదరాబాద్,ఢిల్లీ తదితర నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో రెండు రోజుల్లో విక్రయాలకు అందుబాటులో ఉంచుతారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది