2500 HEALTH WORKERS DEPLOYED FOR SANITATION- HEALTH OFFICER _ 2500 మంది సిబ్బందితో పారిశుద్ధ్య చర్యలు – టీటీడీ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి
Tirumala, 24 September 2023: TTD Health Officer Dr Sridevi said on Saturday that around 2500 sanitation workers were deployed during Srivari annual brahmotsavam for keeping Tirumala hill shrine and its premises clean and hygienic
Addressing media at the Rambagicha Media Center on Sunday she said, while 243 were pressed into service during normal days, 747 were deployed on the Garuda vahana seva day.
She said along Mada Streets, 278 workers were used and 187 water points set up in addition to existing 230 points with support of 681 Srivari sevaks for distributing water.
She said drinking water and food packets were tested frequently by experts of the Kurnool regional lab and YTD food lab.
Similarly, price lists in food stalls and food items were subjected to frequent inspection with devotees feed back.
23,230 DEVOTEES UTILIZED MEDICAL AID IN SIX DAYS- CMO I/c
TTD Incharge CMO Dr Narmada said in all 23,230 devotees were given medicines in medical outlets set up all over Tirumala in the last six days during the ongoing annual festival.
Addressing media in RBGH 2 Media Center on Sunday she said besides Ashwini Hospital 8 more centres were set up in addition to the existing 6 dispensaries and 6 primary health centres in Tirumala for Brahmotsavams.
The medical fraternity consisting of 40; doctors, 35 paramedics and 13 ambulances drawn from SVIMS, BIRRD and Ruia hospitals were stationed on 24×7 basis.
While 4800 pilgrims were treated on Garuda seva day alone and 10,000 on Mada Streets were given treatment on mobile battery vehicle clinics remaining days.
Dr Kusuma Kumari, Medical Superintendent of Ashwini Hospital, APRO Kum. P Neelima were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – 2023
2500 మంది సిబ్బందితో పారిశుద్ధ్య చర్యలు – టీటీడీ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి
తిరుమల, 2023 సెప్టెంబరు 24: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో దాదాపు 2500 మంది సిబ్బందితో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్టు టీటీడీ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి తెలిపారు. తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్‌లో ఆదివారం ఆరోగ్యశాఖాధికారి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల రోజుల్లో 243 మందిని, గరుడసేవనాడు 774 మంది అదనంగా ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. గరుడసేవనాడు మొత్తం 136 టన్నుల చెత్తను తొలగించామన్నారు. రథోత్సవం నాడు మాడ వీధుల్లో ఇసుకను తొలగించేందుకు అదనంగా 278 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆలయ మాడ వీధుల్లో భక్తులకు తాగునీటిని అందించేందుకు 230 తాగునీటి పాయింట్లు ఉన్నాయని, బ్రహ్మోత్సవాల్లో అదనంగా 187 పాయింట్లు ఏర్పాటు చేశామని వివరించారు.
గరుడ సేవ నాడు 681 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు తాగునీరు అందించినట్టు చెప్పారు. మాడవీధులు, ఇతర ప్రాంతాల్లో 3 రైడ్ ఆన్ యంత్రాలు, 12 జెట్ మెషిన్లు, ఒక గల్ఫర్‌తో పారిశుద్ధ్య చర్యలు చేపట్టామన్నారు. కర్నూలులోని రీజనల్ ప్రయోగశాల, తిరుమలలోని టీటీడీ ఆహార ప్రయోగశాల నిపుణులు తిరుమలలోని తాగునీరు, ఆహార నాణ్యతను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. హోటళ్లలో ఆహార నాణ్యతకు సంబంధించి భక్తుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్టు చెప్పారు. హోటళ్లలో ధరల పట్టికను ప్రదర్శించేలా సూచిస్తున్నామన్నారు.
ఆరు రోజుల్లో 23,230 మందికి వైద్యసేవలు
– ఇన్‌చార్జి సిఎంఓ డాక్టర్ నర్మద
బ్రహ్మోత్సవాల ఆరు రోజుల్లో 23,230 మంది భక్తులకు వైద్యసేవలందించినట్టు టీటీడీ ఇన్‌చార్జి సిఎంఓ డాక్టర్ నర్మద తెలిపారు.
మీడియా సెంటర్‌లో డాక్టర్ నర్మద మాట్లాడుతూ భక్తులకు వైద్యసేవలందించేందుకు తిరుమలలో అశ్విని ఆసుపత్రితోపాటు ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల కోసం అదనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. స్విమ్స్, బర్డ్, రుయా ఆసుపత్రుల నుండి 40 మంది డాక్టర్లు, 35 మంది పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. భక్తుల కోసం 24 గంటల పాటు 13 అంబులెన్సులను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.
గరుడ సేవ నాడు 4800 మందికి వైద్యసేవలందించామని, మాడవీధుల్లో బ్యాటరీ వాహనాల్లో దాదాపు 10 వేల మందికి మందులు పంపిణీ చేశామని తెలిపారు. చక్రస్నానం రోజు శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద వైద్యబృందంతోపాటు అంబులెన్సును అందుబాటులో ఉంచుతామని, నూతన పరకామణి భవనం వద్ద మరో అంబులెన్సు ఉంటుందని తెలిపారు.
మీడియా సమావేశంలో అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.