295th BIRTH ANNIVERSARY CELEBRATIONS OF MATRUSHRI TARIGONDA VENGAMAMBA ON MAY 10 AND 11 _ మే 10, 11వ తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాలు

Tirupathi, 09 May 2025: The 295th Birth Anniversary Celebrations of Matrushri Tarigonda Vengamamba will be held with grandeur on May 10 and 11 in Tirupati and Tarigonda.

In Tirupati…

On May 10 and 11, a literary session is organized at the Annamaacharya Kalamandiram in Tirupati at 10 AM. From 6 PM to 8 PM, Bhakti Sangeet programs will take place.

On May 11, at 9 AM, a floral tribute will be offered to the statue of Matrushri Tarigonda Vengamamba located at the M.R.Palli Circle in Tirupati.

In Tarigonda…

On May 11, a special Snapana Tirumanjanam will be conducted to Sri Lakshmi Narasimha Swamy in Tarigonda, followed by a floral tribute to Matrushri Tarigonda Vengamamba at the temple premises. 

From 6 PM to 8 PM, Goshti Ganam and Harikatha programs will be held by Annamaacharya Project artists.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 10, 11వ తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2025 మే 09: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాలను మే 10, 11వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో వైభవంగా నిర్వహించనున్నారు.

తిరుప‌తిలో…

మే 10, 11వ తేదీల్లో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితి సదస్సు నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

మే 11వ తేది ఉదయం 9 గంటలకు తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు.

తరిగొండలో

మే 11వ తేది తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, ఆలయ ప్రాంగణంలో శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ‌కు పుష్పాంజలి, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులతో గోష్టి గానం, హరికథ నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.