UGADI SPECIAL PROGRAMS AT NADA NEERAJANAM ON MARCH 30 _ 30న నాద నీరాజనం వేదికపై ఉగాది కవి సమ్మేళనం
UGADI ASTHANA AT SRIVARI TEMPLE
Tirumala, March 29, 2025: To celebrate Sri Vishwavasu Nama Telugu Ugadi, a poets’ gathering – Kavi Sammelanam will be held on March 30 at Nada Neerajanam platform, opposite Srivari Temple in Tirumala.
This program is organized between 12 noon and 1pm. In this, the poets and scholars explain about our culture, traditions, and the services provided to TTD devotees in a Poetic way.
Asthanam
Meanwhile, in view of Sri Vishwavasu Nama Samsthra Ugadi, Asthana will be observed at Srivari Temple in Tirumala on Sunday in a grand manner.
This Asthanam is conducted by Agama scholars and priests at the Bangaru Vakili from 7 am to 9 am in accordance with the scriptures.
TTD has cancelled the Kalyanotsavam, Unjal Seva and Arjitha Brahmotsavam, in view of Ugadi on Sunday.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
30న నాద నీరాజనం వేదికపై ఉగాది కవి సమ్మేళనం
శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
తిరుమల, 2025 మార్చి 29: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 30వ తేది తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై కవి సమ్మేళనం కార్యక్రమం జరగనుంది.
ఏడు కొండలపై ఏడు కొండలవాడి సాక్షిగా ఏడుగురు కవులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 30వ తేది మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో మన సంస్కృతి, సాంప్రదాయాలు, టీటీడీ భక్తులకు చేస్తున్న సేవలపై కవులు పద్యాల రూపంలో వివరిస్తారు.
శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరుగనుంది.
ఉదయం 7 నుండి 9 గంటల నడుమ ఈ ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.