30 CRORES TO PROMOTE VEDIC STUDIES_ వేద విద్య ప్రచారానికి రూ.30 కోట్లతో వార్షిక బడ్జెట్ : ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ
Tirumala, 2 Oct. 19: The annual budget allocated towards promotion of Vedic Studies by TTD as a part of its basic slogan of the protection and propagation of Hindu Sanatana Dharma is Rs.30crores said, the Project Officer of Sri Venkateswara Higher Vedic Studies, Dr A Vibhishana Sharma.
During the media briefing in Media Centre at Tirumala on Wednesday, Sri Sharma said, TTD has been paying a remuneration of Rs.19,000 and Rs.18,000 respectively for the welfare of Ghanapathis, Kramapathis who are present in the country. Apart from these schemes, Kuamaradhyapaka Scheme, Veda Vidwat Sadassu, Veda Pathashala are also under Vedic Studies promotional activities by TTD, he added.
Under Agama programme also we are funding renowned vedic scholars with a fund of Rs.3200 per month. These scholars will render Vedaparayanam on every pournami in the temples of their respective places, he maintained.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
వేద విద్య ప్రచారానికి రూ.30 కోట్లతో వార్షిక బడ్జెట్ : ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ
అక్టోబరు 02, తిరుమల, 2019: హిందూ సనాతన ధర్మానికి మూలమైన వేదాల పరిరక్షణ, వేద విద్య ప్రచారానికి టిటిడి రూ.30 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించిందని ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. విభీషణ శర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఘనాపాఠీలు, క్రమాపాఠీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వరుసగా రూ.19 వేలు, రూ.18 వేలు సంభావన నెలవారీగా అందిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా కుమార అధ్యాపక పథకం అమలవుతోందని, వేద పాఠశాలలు నడుస్తున్నాయని, వేద విద్వత్ సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆగమ పథకంలో భాగంగా ప్రముఖ వేదపండితులకు నెలకు రూ.3200/- ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. ఈ పండితులు ప్రతి పౌర్ణమినాడు ఆలయాల్లో వేదపారాయణం చేస్తారని తెలిపారు. .
మీడియా సమావేశంలో టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.