3rd Day of Sri Padmavathi Ammavari Float Festival _ తెప్పపై శ్రీ అలమేలు మంగ అభయం
తెప్పపై శ్రీ అలమేలు మంగ అభయం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరుగనుంది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెప్పోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, లక్ష్మీపూజను రద్దు చేశారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.