519th ANNAMAIAH VARDHANTI FETE FROM MARCH 28 – APRIL 1 _ మార్చి 28 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీతాళ్లపాక అన్నమయ్య 519వ వర్ధంతి కార్యక్రమాలు

Tirumala, 26 March 2022: TTD is gearing up to organise the 519 Vardhanti of Patriarch of Telugu Poetry Sri Tallapaka Annamacharya from March 28 to April 1 in Tirumala besides Tirupati and birthplace of saint-poet, Tallapaka in YSR Kadapa district in a big way.

Born in 1408 Annamaiah in his 95 years of life span till he attained salvation in 1503, had penned 32, 000 sankeertans in praise of Sri Venkateswara Swamy.

AT TIRUMALA

Prominent artists will perform Saptagiri Sankeertana Yagnam at the Narayanagiri Gardens in Tirumala in the evening between 5.30 pm and 8.30 pm on March 29. Sri Ahobila Mutt Seer Sri Sri Sri Satagopa Sri Ranganatha Yatindra Maha Desikan Swami will render Anugraha Bhashanam on the occasion.

AT TIRUPATI: METLOTSAVAM AT ALIPERI ON MARCH 28

Ahead of the imposing event of Metlotsavam at Padala mandapam in Alipiri on at 6am, the artists of the Annamacharya project and other bhajan mandals will perform Saptagiri Sankeertan Gosti Ganam. Later on the artists will walk up to Sri Bedi Anjaneya Swamy temple at Tirumala.

AT ANNAMACHARYA KALA MANDIRAM

At Annamacharya Kala Mandiram in Tirupati, TTD is organizing a series of activities from March 28-April 1 which included Saptagiri Sankeertana Gosti Ganam, Sahiti Sadassu and Sangeeta Sabahas. Among them is the drama titled Anjanadri Hanumadwaibhavam on March 31 and Sri Govindrajaswami Asthanam and Sangeeta Sabhas on April 1 will be observed.

AT MAHATI AUDITORIUM

TTD is organizing Sangeeta Sabahas at the Mahati auditorium from March 29 to April 1 wherein eminent singers and dancers will perform and regale the music lovers of the temple city.

At Tallapaka in YSR Kadapa district, TTD is organizing Saptagiri Sankeertana Gosti Ganam at Dhyana Mandiram on Dwadasi day on March 29. Thereafter Harikathas, Sangeeta Sabhas etc. will be organized at Dhyana Mandiram and the 108 feet Annamaiah statue every day during these three days.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 28 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీతాళ్లపాక అన్నమయ్య 519వ వర్ధంతి కార్యక్రమాలు

తిరుమల, 2022 మార్చి 26: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 28 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో తిరుమల, తిరుపతితోపాటు వారి జన్మస్థలమైన తాళ్లపాకలో నిర్వ‌హించనున్నారు.

అన్న‌మ‌య్య‌ 1408వ సంవత్సరంలో జన్మించారు. 1503వ సంవత్సరంలో పరమపదించారు. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని కీర్తిస్తూ 32 వేల కీర్తనలు రచించారు.

తిరుమలలో….

మార్చి 29వ తేదీన‌ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ప్రముఖ కళాకారులతో ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ అహోబిలమఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజి అనుగ్రహ భాషణం చేయనున్నారు.

తిరుపతిలో….

మార్చి 28న అలిపిరిలో మెట్లోత్సవం…

తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 28వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు అన్నమాచార్యుల వారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ నడక మార్గంలో తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకుని హారతి ఇస్తారు. టిటిడి అధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి భజన మండళ్లకళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అన్నమాచార్య కళామందిరంలో…

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మార్చి 29న ఉద‌యం 9 గంట‌ల నుండి స‌ప్త‌గిరి సంకీర్త‌న‌ల‌ గోష్టిగానం నిర్వ‌హిస్తారు. మార్చి 30, ఏప్రిల్ 1వ తేదీల్లో ఉద‌యం 10 నుండి గంట‌ల నుండి సాహితీ స‌ద‌స్సులు, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సంగీత స‌భ‌లు జ‌రుగ‌నున్నాయి. మార్చి 31వ తేదీన అంజనాద్రి హనుమద్వైభవం పేరిట సాహితీ రూపకం నిర్వహిస్తారు.

ఏప్రిల్ 1న ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆస్థానం, సంగీత స‌భలు నిర్వ‌హిస్తారు.

మ‌హ‌తి ఆడిటోరియంలో…

మ‌హ‌తి ఆడిటోరియంలో మార్చి 29 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సంగీత స‌భ‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారులు పాల్గొననున్నారు.    

తాళ్ల‌పాక‌లో …

తాళ్లపాకలోని ధ్యానమందిరం వ‌ద్ద మార్చి 29న ఉద‌యం 9 గంట‌లకు దిన‌ము ద్వాద‌శి, స‌ప్త‌గిరి సంకీర్త‌న‌ల‌ గోష్టిగానం నిర్వ‌హిస్తారు. మార్చి 29 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంట‌ల వ‌ర‌కు సంగీతం, హ‌రిక‌థ కార్యక్రమాలు జరుగనున్నాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.