59th Vardhanthi Celebrations of Sri Veturi Prabhakara Sastry _ శ్రీ ప్రభాకరశాస్త్రిగారి 59వ వర్థంతి సభ
Tirupati, 29 Aug 2009: Garlanding the Statue of Sri Veturi Prabhakara Sastry by Sri Brahmachary,Spl Officer Sri Veturi Prabhakara Sastry Vangamaya Peetam on the ocassion of 59th vardhanthi celebrations in Tirupati on Aug 29.
Sri Veturi Ananda Murthy,Son of Sri Veturi Prabhakara Sastry, Sri Sachidananda, Sri Chenchu Subbaiah, Sri Sarvotham Rao and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ ప్రభాకరశాస్త్రిగారి 59వ వర్థంతి సభ
తిరుపతి, ఆగష్టు -29, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవేటూరి ప్రభాకర శాస్త్రి వాఙ్మయపీఠం ఆధ్వర్యంలో శ్రీశాస్త్రిగారి 59వ వర్థంతి సందర్భంగా వర్థంతి సభ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ప్రాచ్య మరియు పి.జి. కళాశాల శనివారం మధ్యాహ్నం జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రాచ్యకళాశాల ప్రిన్సిఫాల్ డాక్టర్ ఎం.లలితకుమారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా శ్రీ ప్రభాకరశాస్త్రిగారి కుమారులు ఆచార్య వేటూరి ఆనందమూర్తి విచ్చేసి, వారి తండ్రిగారి జీవితం, వారి రచనలు, వాఙ్మయసేవ, యోగజీవితం, సామాజికసేవ మున్నగు విశేషాలు – సముదాత్తఘట్టాలతో వివరించారు.
వక్త – ఆచార్య కట్టమంచి మహాలక్ష్మమ్మగారు శ్రీశాస్త్రిగారి ఖండ కావ్యాల్లో మున్నాళ్ల ముచ్చట, కపోతకథ, కడుపుతీపు అనే మూడింటిపై సమగ్ర విశ్లేషణాత్మకంగా వివరించారు. ఈ మూడు ఖండకావ్యాలు నేటి సమాజానికి ఉదాత్తమైన జీవన సందేశాన్ని ఇస్తున్నాయనీ, పేరుకు ఖండకావ్యాలే అయినా మహాకావ్య లక్షణాలైన ఆనందం, హితబోధ అనే ఉన్నత ఆశయాలను వెల్లడిస్తున్నాయనీ వివరించారు.
అధ్యకక్షురాలు డాక్టర్ లలితకుమారి తమ తొలిపలుకుల్లో ప్రాచ్యకళాశాలలో వేటూరి ప్రభాకరశాస్త్రి విగ్రహం ఉండటం – గొప్ప ప్రతిష్ఠ అనీ, శాస్త్రిగారి వద్ద చదువుకున్న ఆనాటి శిష్యులు మహాకవులై, విమర్శకులై, పండితులై, రచయితలై ఎంతో పేరు ప్రతిష్ఠలు గడించారనీ పేర్కొన్నారు. వాఙ్మయపీఠం ప్రత్యేకాధికారి డాక్టర్ కె. బ్రహ్మాచారి – పీఠం ఆశయాలూ, శాస్త్రిగారి వాఙ్మయసేవ, యోగజీవితం – సమాజానికి ఎలా స్ఫూర్తిదాయకాలో వివరించారు.
సభలో విద్వాన్ సింగరాజు సచ్చిదానందం, ఆచార్య కె.సర్వోత్తమరావు, డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య, డాక్టర్ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, డాక్టర్ ఆకేళ్ల విభీషణశర్మ మొదలైన పండితులు, అధ్యాపకులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. శాస్త్రిగారి శిష్యుల్లో ప్రముఖులైన సింగరాజు సచ్చిదానందంగారు తమ గురువుగా ఉత్తమ గురుత్వాన్నీ, వారికున్న శిష్యవాత్సల్యాన్నీ వివరించారు. ఆచార్య సర్వోతమరావు శాస్త్రిగారి రచనా విశిష్టతను వివరించారు. డాక్టర్ సముద్రాల లక్ష్మయ్యగారు శ్రీశాస్త్రిగారి వాఙ్మయ సేవను కొనియాడారు. డాక్టర్ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య ప్రభాకరశాస్త్రిగారి సామాజిక సేవనూ, వారి నిస్వార్థనిష్కళంక మనస్తత్వాన్ని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డాక్టర్. కె.బ్రహ్మాచారి, ప్రాచ్యకళాశాల విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.