605TH JAYANTHI CELEBRATIONS OF ANNAMAIAH AT TALLAPAKA _ మే 24 నుండి 26వ తేదీ వరకు తాళ్లపాకలో ఘనంగా అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు
Tirupati, 22 May: The 605th Jayanti celebrations of Saint Poet Sri Tallapaka Annamacharya will be observed in a grand manner by TTD in the native place of the legendary poet from May 24 to 26.
This 15th century poet who was born in the hamlet of Tallapaka of Rajampeta Mandal in Kadapa district has penned over 32thousand kritis in praise of Lord Venkateswara. As a tribute to his great contributions, TTD has been observing his Birth and Death day celebrations from the past eight years in the village of Tallapaka apart from conducting spiritual programmes in Tirupati, Tirumala and Tiruchanoor.
On May 24, the day starts with Nadaswara Sammelan by 8am at Dhyanamandir in Tallapaka followed by Sapthagiri Sankeertana Gosti Ganam between 9am to 10am. The celestial wedding of the processional deities of Lord Malayappa Swamy and his two consorts, Sridevi and Bhudevi will be conducted between 10.30am to 1pm. On the same day, TTD has organised some special devotional cultural programmes near 108-feet statue of Annamacharya which will commence 6pm and also in Dhyana mandir by 7.30pm. There will be cultural programmes even on 25th and 26th of May both at Tallapaka Dhyana Mandir and at the statue.
FREE BUSES:
Meanwhile TTD has arranged free transportation facility where in two APSRTC buses will carry the pilgrims to Tallapaka from Rajampet and surrounding villages on May 24 to attend this ceremonious fete.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 24 నుండి 26వ తేదీ వరకు తాళ్లపాకలో ఘనంగా అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు
తిరుపతి, మే 22, 2013: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్లపాకలో మే 24 నుండి 26వ తేదీ వరకు అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. పదకవితా పితామహునిగా వినుతికెక్కిన అన్నమయ్య తిరుమల శ్రీవారికి అపరభక్తుడు. తన సంకీర్తనల ద్వారా శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారు. తిరుమలలో స్వామివారు తెల్లవారుజామున మేల్కొన్నప్పటి నుండి రాత్రి పవళించే వరకు జరిగే అన్ని రకాల సేవలపై అన్నమయ్య కీర్తనలు రచించి ప్రచారం చేశారు.
మే 24వ తేదీ ఉదయం 8.00 గంటలకు తాళ్లపాక ధ్యానమందిరంలో నాదస్వర సమ్మేళనంతో జయంతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9.00 నుండి 10.00 గంటల వరకు సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం, 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు మదనపల్లికి చెందిన శ్రీ పి.కదిరి నరసింహులు సంగీత సభ జరగనుంది. రాత్రి 8.45 నుండి 10.00 గంటల వరకు అనంతపురానికి చెందిన శ్రీ డి.బాలబ్రహ్మం భాగవతార్ హరికథా కాలక్షేపం నిర్వహించనున్నారు.
అదేవిధంగా మే 25వ తేదీన రాత్రి 7.30 నుండి 10.30 గంటల వరకు సంగీత సభలు, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి. మే 26వ తేదీ ఆదివారం ఉదయం 10.00 గంటలకు నందలూరు కథానిలయం అధ్యకక్షులు శ్రీ ఎ.రాజేంద్రప్రసాద్ నిర్వహణలో కవిసమ్మేళనం జరుగనుంది. రాత్రి 7.30 నుండి 10.30 గంటల వరకు సంగీత సభలు, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అలాగే తాళ్లపాకలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద మే 24వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం, ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుండి కళాకారులు పాల్గొననున్నారు. రాత్రి 7.45 నుండి 9.15 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ జె.పురుషోత్తం హరికథా కాలక్షేపం నిర్వహించనున్నారు. ఈ వేదిక వద్ద మే 25, 26వ తేదీల్లో సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.15 గంటల వరకు సంగీత సభలు, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
భక్తుల కోసం ఉచితంగా రెండు బస్సులు:
శ్రీ తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోసం తితిదే రెండు ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేయనుంది. ఇవి మే 24వ తేదీన రాజంపేట, పరిసర గ్రామాల నుండి బయలుదేరి భక్తులను ఉచితంగా తాళ్లపాకకు తీసుకెళ్లనున్నాయి.
శ్రీ తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోసం తితిదే రెండు ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేయనుంది. ఇవి మే 24వ తేదీన రాజంపేట, పరిసర గ్రామాల నుండి బయలుదేరి భక్తులను ఉచితంగా తాళ్లపాకకు తీసుకెళ్లనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.