971st INCARNATION OF SRI ANANTALWAR OBSERVED _ తిరుమలలో ఘనంగా శ్రీ అనంతాళ్వారు 971వ అవతారోత్సవం

Tirumala, 23 February 2025: The 971st incarnation of Sri Vaishnava devotee, Sri Anantalwar, was celebrated on Sunday at Ananthalwar Tota also known as Purasaivarithota in Tirumala.  

On this occasion, the successors of Anantalwar spread across the country gathered and rendered “Nalayira Divya Prabandha Gosthiganam”. 

 

On this occasion, HH Tirumala Sri Sri Pedda Jeeyar Swamy, while delivering his blessing speech, said that through the TTD Alwar Divya Prabandha Project, eminent scholars from all the Vaishnava Divyadesams are being invited every year and through their lectures, the glory of Anantalwar was conveyed in the most wonderful way.    

Later, in his Anugraha Bhashanam HH Tirumala Sri Sri Sri Chinna Jeeyar  Swamy said that Anantalwar joined Sri Ramanujacharya as his first disciple and went to Tirumala to offer flowers to Sri Venkateswara Swamy and pioneered Pushpa Kainkaryam in Tirumala. That is why Tirumala is also known as Pushpa Matham and explained about the peculiarity of his life.

On this occasion, scholars rendered speech on Venkatachala Itihasamala, Ramanujavari Tirumala Yatra, Swami Pushkarini Vaibhavam, Sri Ramayana Kalakshepam, Tirumalanambi – Thanniramudhu Utsavam, Moolavarla Thirumanjanam – Thirunamam, Ramanuja Sannidhi Pratistha in Tirumala, Sahasranamarchana Vibhavam, Establishment of Jeeyar Mutt in Tirumala, Srivari Suprabhatam-Ekanta Seva Tirumala, Punya Tirthas in Tirumala and many more.

TTD Dasa Sahitya Project Special Officer Dr. Ananda Tirthacharyulu, successors of Sri Anantalwar including Sri. Venkata Krishna Swamy, Sri Bharadwaja Swamy and others participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా శ్రీ అనంతాళ్వారు 971వ అవతారోత్సవం

తిరుమల, 2025 ఫిబ్రవరి 23: శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 971వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌తోటలో (పురశైవారితోట) ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా అనంతళ్వారు వంశీకులు ”నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి అనుగ్రహభాషణం చేస్తూ టీటీడీ ఆళ్వార్ దివ్వ ప్ర‌బంధ ప్రాజెక్టు ద్వారా 108 వైష్ణ‌వ‌ దివ్య‌దేశాల నుండి ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి త‌మ ఉపన్యాసాల ద్వార అనంతాళ్వార్ వైభ‌వాన్ని అత్యంత అద్భుతంగా తెలియ‌జేస్తున్నార‌న్నారు. అనంతాళ్వారు వంశీకులు గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహమన్నారు.

అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి అనుగ్రహభాషణం చేస్తూ అనంతాళ్వార్ శ్రీ రామానుజాచార్యుల వారికి ప్ర‌థ‌మ శిశ్యుడిగా చేరి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామికి పుష్ప‌కైంక‌ర్యం కోసం తిరుమ‌ల‌కు విచ్చేశార‌న్నారు. ఆ కాలంలో ఆయ‌న తిరుమ‌ల‌కు వ‌చ్చి శ్రీ‌వారి పుఫ్క‌రిణీ త‌వ్వి పుష్ప కైంక‌ర్యం ప్రారంభించార‌న్నారు. అందుకే తిరుమ‌ల‌కు పుష్ప మ‌ఠం అని తిరుమ‌ల‌కు పేరు వ‌చ్చింద‌ని ఆనంతాళ్వార్‌ జీవిత వైశిష్ట్యం గురించి వివరించారు.

ఈ సందర్భంగా వేంకటాచల ఇతిహాసమాల, రామానుజులవారి తిరుమల యాత్ర, స్వామి పుష్కరిణి వైభవం, శ్రీ రామాయణ కాలక్షేపం, తిరుమలనంబి – తన్నీరముదు ఉత్సవం, మూలవర్ల తిరుమంజనం – తిరునామం, తిరుమలలో రామానుజ సన్నిధి ప్రతిష్ట, సహస్రనామార్చన వైభవం, తిరుమలలో జీయర్ మఠం స్థాపన, శ్రీవారి సుప్రభాతం-ఏకాంత సేవ, తిరుమలలో దివ్యప్రబంధ క్రమం, తిరుమలలో పుణ్య తీర్థాలు తదితర అంశాలపై వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పండితులు ఉపన్యసించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు, అనంతాళ్వార్ వంశస్తులు శ్రీ వేంక‌ట కృష్ణ స్వామి, శ్రీ భ‌ర‌ద్వాజ‌స్వామి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.