98 మంది టిటిడి మహిళా ఉద్యోగులకు సన్మానం
98 మంది టిటిడి మహిళా ఉద్యోగులకు సన్మానం
తిరుపతి, 2021 మార్చి 08: టిటిడి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 2021 మార్చి నుండి 2022 ఫిబ్రవరి వరకు పదవీ విరమణ పొందనున్న 98 మంది మహిళా ఉద్యోగులను శాలువ, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.
వీరిలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి.బి.ఝాన్సీరాణి, సర్వీసెస్ డెప్యూటీ ఈవో శ్రీమతి టిఎస్.కస్తూరి బాయి తదితరులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.