AADI KRITHIKA AT SRI KAPILESWARA SWAMY TEMPLE ON AUGUST 16_ ఆగస్టు 16న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక

Tirupati, 09 August 2025: The Aadi Krithika festival will be celebrated at the Sri Kapileswara Swamy Temple in Tirupati on August 16.

As part of the festivities, Snapana Tirumanjanam will be performed to the Utsava Murthies of Sri Valli Devasena Sametha Subramanya Swamy from 9:30 a.m. to 10:30 a.m., with a special abhishekam using milk, curd, honey, sandal paste, and other fragrant ingredients.

In the evening, from 6 p.m. to 8 p.m., a Tiruveedhi Utsavam will be conducted, wherein the processional deities of Sri Valli Devasena Sametha Subrahmanya Swamy will be taken in a procession around the temple streets.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 16 శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక

తిరుప‌తి, 2025 ఆగస్టు 09: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీన ఆడికృత్తిక పర్వదినం జరగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.