ABHISHEKA SEVA MUSES VIJAYAWADA DENIZENS_ శ్రీవారి అభిషేక సేవతో పులకించిన విజయవాడ భక్తజనం
AROMA OF SACRED MIXTURES DELIGHTS DEVOTEES
Vijayawada, 7 July 2017: The denizens of Vijayawada who converged to witness the most coveted Abhisheka Seva were enthralled by the divine charm of Lord on Friday in PWD grounds on the fourth day of the ongoing Sri Venkateswara Vaibhavotsavams.
After Sulrabhatam, Thomala and Archana sevas, the Abhishekam to the presiding deity of Lord Venkateswara started with sacred waters, then with Milk, followed by sandal paste and other scented articles like powdered Pachcha Karpooram, which were brought earlier in the silver vessels.
While performing the Abhishekam to Moola Virat, Purshasukta, Narayanasukta, Srisukta, Bhusuktha, Neelasuktha and selected Pasurams from the Divya Pradbandham were all recited by the priests. Later, the Abhishekam is performed for the image of Goddess Lakshmi situated on the chest of Lord with Turmeric Paste.
The entire premises were caught in the fine aroma of these sacred ingredients giving a chill thrill to the devotees.
KALYANOTSAVAM AND VASANTHOTSAVAM ON JULY 8
Twin religious events are set to muse the denizens of Vijayawada on Saturday with Vasanthotsavam in the morning and celestial wedding of the deities, Srinivasa Kalyanam in the evening.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి అభిషేక సేవతో పులకించిన విజయవాడ భక్తజనం
విజయవాడ, 2017, జూలై 07: విజయవాడలో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో నాల్గవ రోజైన శుక్రవారం శ్రీవారి నమూనా ఆలయంలో నిర్వహించిన అభిషేక సేవతో భక్తులు పులకించిపోయారు. భక్తులు తనివితీరా స్వామివారిని దర్శించుకుని తరించారు.
ఇక్కడి పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9.00 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు.
అభిషేకం : ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు…
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం. భగవద్రామానుజుల వారు శ్రీ స్వామివారి వక్షఃస్థలంలో ”బంగారు అలమేలుమంగ” ప్రతిమను అలంకరించిన శుక్రవారం నాటితో మొదలుపెట్టి ప్రతి శుక్రవారం అభిషేకం జరిగేట్టు ఏర్పాటుచేశారట. పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్రజలాలతో సుమారు గంట పాటు అభిషేకం జరిగింది. ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థలమ్మీది మహాలక్ష్మికి కూడా అభిషేకం నిర్వహించారు.
బ్రహ్మాది దేవతల కోరిక మేరకు కలియుగంలో వెలసిన శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షఃస్థల లక్ష్మితో కలిసి ఈ శుక్రవారాభిషేక సమయంలో మాత్రమే దర్శించేందుకు వీలవుతుంది. అభిషేకం తరువాత శ్రీస్వామివారి మెడలో ఉన్న బంగారు అలమేలు మంగకు కూడా అభిషేకం చేశారు. అభిషేకానంతరం భక్తులందరి మీద తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేక దర్శనం ముగిసింది.
అనంతరం 10.00 నుంచి 10.30 గంటల వరకు రెండో నివేదన,ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. సాయంత్రం 5.45 గంటల నుంచి రాత్రి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకరణసేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.15 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు ఏకాంత సేవ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గౌ|| శ్రీ గంటా శ్రీనివాస్, గౌ|| శ్రీ కామినేని శ్రీనివాస్, టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు, ఒ.ఎస్.డి. శ్రీసుబ్బరాయుడు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 4.00 నుంచి 6.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ బాలకృష్ణ ప్రసాద్ మరియు శ్రీమతి బుల్లెమ్మ బృందం భక్తి సంగీతం, రాత్రి 7.00 నుండి 8.15 గంటల వరకు నిడదవోలుకు చెందిన శ్రీధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి ధార్మిక ఉపన్యాసం ఇవ్వనున్నారు.
——————————————————————
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.