ADDITIONAL EO INSPECTS AND REVIEWS MUSEUM WORKS _ తుది దశకు చేరుకున్న ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు

TIRUMALA, 22 APRIL 2026: The TTD Additional EO Sri Ch Venkaiah Chowdary on Wednesday evening inspected and reviewed the ongoing works of SV Museum in Tirumala with the officials concerned.

Speaking on this occasion he said the SV Museum is coming up with all its new looks in 1.20lakh sft. area, featuring 14 interactive galleries developed by TCS, focusing on Tirumala’s historical, architectural, and cultural significance.

The new development aims to create a “world-class” experience for visitors, focusing on educating devotees about the rich heritage of the Tirumala temple, he maintained.

The Additional EO also said the inner galleries works are completed with the support of TCS and outer galleries are under completion in near future. We are contemplating to inaugurate the Museum with the Honourable CM of AP Sri N Chandrababu Naidu during this year’s annual brahmotsavams scheduled in September, he maintained.

Chief Museum Officer(FAC) Sri Somannarayana, other officials, TCS representatives were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

తుది దశకు చేరుకున్న ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు

బ్రహ్మోత్సవాల్లో సీఎం చేతులమీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి

తిరుమల, 2026 ఏప్రిల్ 22: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో జరుగుతున్న శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన మ్యూజియం ఆధునీకరణ పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మ్యూజియం ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులు నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.

సుమారు 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మ్యూజియంలో దాదాపు లక్ష చదరపు అడుగుల మేర పనులు పూర్తయ్యాయని, మొత్తం 14 గ్యాలరీలను అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ప్రత్యేక అనుభూతి కలిగేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు.

తిరుమల క్షేత్ర వైభవం, ఆలయ చారిత్రక నేపథ్యం, శాసనాలు, అన్నమాచార్య గ్యాలరీ, పల్లవులు, చోళులు, విజయనగర రాజులు వంటి వివిధ రాజవంశీయులకు శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని గ్యాలరీలలో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.

మ్యూజియాన్ని దీర్ఘకాలిక సుస్థిరతతో ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడంపై కూడా చర్చించామని, భక్తులకు మెరుగైన అనుభవం కల్పించేలా ప్రవేశ, నిష్క్రమణ సదుపాయాలు, క్యాఫెటీరియా, సావనీర్ షాప్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు.

భక్తుల తిరుమల యాత్రకు ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక అనుభూతి కలిగించేలా ఈ మ్యూజియాన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ మ్యూజియం ఆఫీసర్ (ఎఫ్ఏసీ) శ్రీ సోమన్నారాయణ, ఇతర అధికారులు, టీసీఎస్ ప్రతానిధులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.