ADDITIONAL EO INSPECTS FOUR MADA STREETS _ శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేసిన అదనపు ఈవో

TIRUMALA, 04 AUGUST 2024: TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary along with the officials concerned, inspected four mada galleries in Tirumala on Sunday.

As the annual Brahmotsavams are scheduled from October 4 to 12, to get to know about the various Entry and Exit, Harati Points located all along the four Mada streets, the Additionally thoroughly inspected all the galleries moving along on a buggie.

The officials explained the Additional EO how the vahanam procession commences from Vahana Mandapam and proceeds along four mada galleries, the movable bridge at Tirumala Nambi temple, entry-exit points at the galleries and many other related information.

Temple DyEO Sri Lokanatham, VGO Sri Nanda Kishore and other officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేసిన అదనపు ఈవో

తిరుమల, 2024 ఆగష్టు 04: తిరుమలలోని శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలను ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరుగనున్న నేపథ్యంలో, నాలుగు మాడ వీధుల్లో ఉన్న వివిధ ప్రవేశ మరియు నిష్క్రమణ, హారతి పాయింట్ల గురించి తెలుసుకోవడానికి అన్ని గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

వాహన మండపం నుంచి ప్రారంభమై నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, తిరుమల నంబి ఆలయం వద్ద కదిలే వంతెన, గ్యాలరీల వద్ద ప్రవేశ నిష్క్రమణ పాయింట్లు మరియు ఇతర సంబంధిత సమాచారాన్ని అధికారులు అదనపు ఈవోకు వివరించారు.

ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ నంద కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.