ADDITIONAL EO INSPECTS LNS TO SEVENTH MILE ON ALIPIRI FOOTPATH ROUTE _ అలిపిరి కాలినడక మార్గంలో అదనపు ఈవో త‌నిఖీలు

TIRUMALA, 28 MAY 2025: The Additional EO Sri Ch Venkaiah Chowdary on Wednesday inspected the forest cover between Lakshmi Narasimha Swamy temple to Seventh Mile along the Alipiri Footpath route in Tirumala.

Along with the TTD Forest and Forest Department officials, the Additional EO walked all through the path and observed the static cameras, motion sensor capture cameras installed all along the path.

He later made some suggestions to the TTD and Forest department officials on how to overcome the issue of Manimal crisis by taking certain short term measures.

TTD Vigilance VGO Sri Ramkumar, Forest Range Officer Sri Doraswamy, Deputy Range Officer Sri Madhusudhan, and other officials were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

అలిపిరి కాలినడక మార్గంలో అదనపు ఈవో త‌నిఖీలు

తిరుమ‌ల‌, 2025 మే 28: తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుండి ఏడవ మైలు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని బుధవారం టీటీడీ అద‌నపు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి త‌నిఖీ చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ అటవీ శాఖ, రాష్ట్ర అటవీశాఖ అధికారులతో కలిసి ఆయన కాలిబాట మార్గాన్ని పరిశీలించారు. న‌డ‌క‌దారిలో ఏర్పాటు చేసి ఉన్న స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు.

అటవీ ప్రాంతంలో మానవ–వన్యప్రాణి ఘర్షణ సమస్యను ఎదుర్కొనడానికి తాత్కాలికంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కొన్ని సూచనలు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ నిఘా వీజీవో శ్రీ రామ్ కుమార్, టీటీడీ అటవీ రేంజ్ అధికారి శ్రీ దొరస్వామి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీ మధుసూదన్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.