ADDITIONAL EO INSPECTS ONGOING DEVELOPMENT WORKS IN TIRUMALA _ తిరుమలలో అదనపు ఈఓ విస్తృత తనిఖీలు

Tirumala, 24 July 2021: TTD Additional Executive Officer Sri AV Dharma Reddy went on a spree of inspections at various locations in Tirumala on Saturday evening.

He inspected the cottages in the GNC, HVC, ANC, SNC, SNRH, and SMC areas and observed the progress of developmental works in the respective regions.

He directed the officials concerned on clearing the debris and wastes in the front and back yards of cottages and instructed the Garden and Forest wing officials for promoting green avenues all around.

EEs Sri Jaganmohan Reddy, Sri Srihari, DE Smt.Saraswati, Deputy EOs Sri Lokanatham, Sri Bhaskar, Additional Health Officer Dr Sunil, Deputy Director Garden Sri Srinivasulu, DFO Sri Chandrasekhar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో అదనపు ఈఓ విస్తృత తనిఖీలు

తిరుమ‌ల‌, 24 జులై 2021: టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి శనివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

జి.ఎన్.సి, హెచ్.వి.సి, ఏ.ఎన్.సి, ఎస్.ఎన్.సి, ఎస్.ఎన్.ఆర్.హెచ్, ఎస్.ఎం.సి ప్రాంతాల్లో కాటేజీలను పరిశీలించారు. కాటేజీల అభివృద్ధి పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాటేజీల వెనుక, మధ్యభాగాల్లో చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ప్రాంతాల్లో పచ్చదనం పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.

అదనపు ఈఓ వెంట ఈఈలు శ్రీ జగన్ మోహన్ రెడ్డి, శ్రీ శ్రీహరి, డిఇ శ్రీమతి సరస్వతి, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, రిసెప్ష‌న్‌ డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్‌, ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్ త‌దిత‌రులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.