ADDITIONAL EO INSPECTS OUTSIDE LINES _ తిరుమ‌ల‌లో అదనపు ఈవో విస్తృత తనిఖీలు 

TIRUMALA, 24 AUGUST 2024: With the weekend pilgrim rush being witnessed in Tirumala, the Additional EO of TTD Sri Ch Venkaiah Chowdhary made sudden inspections during the wee hours on Saturday.

As a part of this, the Additional EO inspected outside lines at Krishna Teja Circle, Narayanagiri Sheds, VQC 2 Compartments and interacted with pilgrims to know about the facilities.

The pilgrims expressed pleasure at the taste of Upma being served to them in compartments.

The Additional EO also instructed the officials concerned to clearly mention the timings of food and beverages being served to pilgrims on the boards outside compartments in a proper manner. He also directed the concern to improve the cleaning in VQC Compartments as soon as they were released.

Later he observed that some private taxis and jeep drivers are parking inside Queue lines obstructing the free movement of pilgrim lines at Krishna Teja Circle. He warned the drivers and immediately instructed the Vigilance sleuths to negotiate with local police on the same avoiding such unauthorized parking in future.

AEOs Sri Gangadharam, Sri Munirathnam and other on duty staffs were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో అదనపు ఈవో విస్తృత తనిఖీలు 
 
తిరుమల, 2024 ఆగస్టు 24: టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం తెల్లవారుజామున తిరుమ‌ల‌లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. 
 
ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, కృష్ణతేజ సర్కిల్, నారాయణగిరి ఉద్యనవనాల్లోని షెడ్లు, క్యూ లైన్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై ఆయన భక్తులకు అవగాహన కల్పించారు. కంపార్ట్మెంట్లలో వడ్డించిన ఉప్మా చాలా రుచికరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
 
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తాగునీరు, అన్న‌ప్ర‌సాదాలు, పాలు అందించే విధానాన్ని పరిశీలించి, కంపార్ట్మెంట్ల వెలుపల ఉన్న బోర్డులపై భక్తులకు అందించే ఆహార పానీయాలు, సమయాలను పేర్కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
 కంపార్ట్మెంట్లను నిరంతరం పర్యవేక్షించి ఎక్కడా జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి వదలాలన్నారు. వీక్యుసి కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి పంపిన వెంటనే, మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
 
కృష్ణ తేజ సర్కిల్ వద్ద భక్తులు క్యూ లైన్ ల లోకి ప్రవేశించే మార్గాల వద్ద  కొందరు ప్రైవేటు టాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా   పార్కింగ్ చేయడాన్ని గమనించి, డ్రైవర్లను హెచ్చరించారు. భవిష్యత్తులో ఐటువంటి అనధికారిక పార్కింగ్ నివారించేందుకు, స్థానిక పోలీసులతో చర్చలు జరపాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
 
అదనపు ఈవో వెంట ఏఈవోలు శ్రీ గంగాధరం, శ్రీ మునిరత్నం, ఇత‌ర అధికారులు ఉన్నారు. 
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.