ADDITIONAL EO INSPECTS PLACES TO SET UP SRIVANI COUNTER _ తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు స్థలం పరిశీలించిన అదనపు ఈవో
Tirumala, 29 July 2024: TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary along with the Tirupati JEO Sri Veerabrahmam inspected various site along with the officials for setting up the permanent ticketing centre and donor section for Srivani devotees in Tirumala.
To issue tickets to SRIVANI Trust donors in a more convenient manner, TTD is mulling to set up an exclusive counter with parking facility.
As a part of this, the team of officials led by Additional EO verified the empty space at the back of Gokulam Rest House, TTD Kalyana Mandapam place by the side Adiseshu Rest House and DFO office.
Later the Additional EO also inspected the newly renovated Annamaiah Bhavan.
SE 2 Sri Jagadeeswar Reddy, Deputy EO Sri Selvam, Transport GM Sri Sesha Reddy and other officials were present.
తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు స్థలం పరిశీలించిన అదనపు ఈవో
తిరుమల, 2024 జూలై 29: తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి పలు ప్రాంతాలలో స్థలాన్ని పరిశీలించారు.
శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేసేందుకు, గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలం, ఆదిశేషు విశ్రాంతి గృహం ప్రక్కన వున్న టీటీడీ కల్యాణ మండపం ప్రాంతం, తిరుమల డిఎఫ్ఓ కార్యాలయం పరిశీలించారు. అనంతరం ఇటీవల ఆధునీకరించిన అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంను పరిశీలించారు.
అదనపు ఈవో వెంట ఎస్‌ఈ 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.