ADDITIONAL EO INSPECTS SUPADHAM ENTRY _ తిరుమలలో అదనపు ఈవో విస్తృత తనిఖీలు
TIRUMALA, 28 JULY 2024: The Additional EO of TTD Sri Ch Venkaiah Chowdhary inspected several places in Tirumala on Sunday evening and made a detailed observation of each and every darshan format.
The inspection commenced from the SSD token verification line at ATGH followed by the compartments in Vaikuntham Queue Complex 1 and 2. At Supatham Entry, the Additional EO thoroughly studied the validation procedure of various formats of darshans including the Parents with Infants, Donors along with the officials concerned. Later he also inspected the SED line and personally verified the photo capture and validation.
Among the officers, SE 2 Sri Jagadeeshwar Reddy, Temple DyEO Sri Lokanatham, DyEO Health Smt Asha Jyothi, GM IT and Transport Sri Sesha Reddy, VGO Sri Nandakishore and other officials were present.
తిరుమలలో అదనపు ఈవో విస్తృత తనిఖీలు
తిరుమల, 2024 జూలై 28: టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాలను, దర్శన క్యూ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఇందులో భాగంగా ఆల్వార్ ట్యాంక్ అతిథి గృహాల వద్ద వున్న ఏస్ఎస్ డి క్యూలైన్లు, టోకెన్ తనిఖీ కేంద్రాలను పరిశీలించారు. తరువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మరియు 2లోని కంపార్ట్‌మెంట్లు, సుపథం వద్ద చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలతోపాటు వివిధ దర్శనాలను సంబంధిత అధికారులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఎస్ఇడి క్యూ లైన్లను, ఫోటో క్యాప్చర్ తదితరాంశాలను పరిశీలించారు.
అదనపు ఈవో వెంట ఎస్‌ఈ 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీమతి ఆశాజ్యోతి, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, విజీఓలు శ్రీ నందకిషోర్, శ్రీ గిరిధర్ రావు ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.