ADDITIONAL EO PLANTS TREES AT TIRUMALA _ తిరుమ‌ల‌లో మొక్క‌లు నాటిన అద‌న‌పు ఈవో

Tirumala,21 March 2022: As part of international forest day celebrations on March 21, the TTD additional EO Sri AV Dharma Reddy on Monday planted trees in Tirumala.

 

TTD additional EO Sri Reddy planted saplings of Sampangi, popularly linked to Tirumala. Thereafter the TTD forest and garden department officials planted various fruit, flower, and social gardening saplings at different locations of Tirumala.

DFO  Sri Seinivasulu Reddy, FROs Sri Prabhakar Reddy abs Sri Venkata Subbiah and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో మొక్క‌లు నాటిన అద‌న‌పు ఈవో

తిరుమ‌ల‌, 2022, మార్చి 21: ప్ర‌పంచ అట‌వీ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం తిరుమ‌ల‌లో మొక్క‌లు నాటారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహిస్తారు.

ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల‌లోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం వ‌ద్ద తిరుమ‌ల స్థ‌ల వృక్ష‌మైన మాను సంపంగి మొక్క‌ను అద‌న‌పు ఈవో నాటారు. అనంత‌రం టిటిడి అట‌వీ, ఉద్యాన‌వ‌న విభాగాల సిబ్బంది ప‌లు ప్రాంతాల్లో మొక్క‌లు నాటారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాసులురెడ్డి, ఎఫ్ఆర్వోలు శ్రీ‌ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, శ్రీ వెంక‌ట‌సుబ్బ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.