ADDITIONAL EO REVIEW MEETING HELD _ అధికారులతో టిటిడి అదనపు ఈవో సమీక్ష
Tirumala, 11 Feb. 20: The inter-departmental review meeting on various progress of works was held by TTD Additional Executive Officer Sri AV Dharma Reddy on Tuesday.
The review meeting was held in Annamaiah Bhavan at Tirumala. The Additional EO reviewed on the pending works with respect to different departments and instructed the concerned to complete the works on time.
He also said, a review meeting on the ongoing arrangements by Engineering department for the upcoming mega Vedic Sadas which will be held from February 25 to March 1 will be conducted in next couple of days exclusively to review on the progress of works.
FACAO Sri Balaji, CE Sri Ramachandra Reddy, CAO Sri Sesha Sailendra, Temple DyEO Sri Harindranath, DyEOs Sri Balaji, Sri Damodar, Sri Nagaraja, Sri Selvam, Health Officer Dr RR Reddy, VSO Sri Prabhakar and others were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
అధికారులతో టిటిడి అదనపు ఈవో సమీక్ష
తిరుమల, 2020 ఫిబ్రవరి 11: టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విభాగాల వారీగా సమీక్షించారు. ఈ నెల 25 నుండి మార్చి 1వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న వేద విద్వత్ సదస్సు ఏర్పాట్లపై రెండు రోజుల్లో ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో టిటిడి ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.రామచంద్రారెడ్డి, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్‌వో శ్రీ మనోహర్, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్ఆర్.రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.